సినిమా బాగుందంటారు.. కొంచెం ల్యాగ్ అంటారు: నాగశౌర్య
1146 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి‘సినిమా బాగుందంటారు.. కానీ కొంచెం ల్యాగ్ ఉంది అంటారు. బాగున్న 90 శాతాన్ని వదిలేసి ఆ 10 శాతం ల్యాగ్‌ని ఎందుకు పట్టించుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు’ అని అన్నారు హీరో నాగశౌర్య. ఆయన నటించిన ‘రంగబలి’ సినిమా నిన్న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయిందంటూ ఈరోజు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో హీరో నాగశౌర్య, హీరోయిన్ యుక్తి తరేజా, దర్శకుడు పవన్ బాసంశెట్టి, నటుడు రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. దర్శకుడు పవన్ ఒక మంచి సినిమా తీశాడని కొనియాడారు. మంచి ఎప్పుడూ చాలా నెమ్మదిగా ఎక్కుతుందని.. ఈ సినిమా కూడా అలాగే నెమ్మదిగా జనాలకు ఎక్కుతుందని చెప్పారు.