నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను.. మిగతా వాళ్లకంటే పెద్ద హిట్ కొట్టాలనుకుంటా: పవన్ కళ్యాణ్
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ తనకు ఇష్టమేనని, అందరి సినిమాలు తాను చూస్తానని, ఇష్టపడతానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘బ్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మిగిలిన హీరోలతో తనకున్న కాంపిటీటివ్నెస్ గురించి మాట్లాడారు. ఒక హీరో సినిమా పెద్ద హిట్ అయితే తన సినిమా అంత కన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటానని.. తనకు కాంపిటీటివ్నెస్ ఉందని అన్నారు. అయితే, ఇదే ఇండస్ట్రీలో RRR, బాహుబలి లాంటి సినిమాలు వస్తే తాను సంతోషిస్తానని.. దాని కన్నా పెద్ద సినిమాలు తీయాలని ఆలోచిస్తానని అన్నారు. కానీ, ప్రస్తుతం తాను రాజకీయాల్లో ఉండడం వల్ల సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నానని చెప్పారు. అయినప్పటికీ తనలోని కాంపిటీటివ్నెస్ తగ్గలేదని.. ఒకవేళ అది లేకపోతే వెనకబడిపోతామని అన్నారు.