Salaar: టీజర్లో అంతే చూపిస్తరు.. ‘సలార్’ ఫ్యాన్ ఫైర్
1609 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తోన్న ‘సలార్’ టీజర్ నిన్న విడుదలైంది. అయితే, ఈ టీజర్‌పై చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. నిరుత్సాహ పడ్డారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే ప్రభాస్‌ను ట్రోల్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తిట్టారు. అయితే, బయట కొంత మంది ప్రభాస్ అభిమానులు మాత్రం ‘సలార్’ టీజర్ అదిరిపోయిందని అంటున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘రంగబలి’ సినిమా చూసి వచ్చిన కొంత మంది ప్రభాస్ అభిమానులు ‘సలార్’ టీజర్ గురించి మాట్లాడారు. టీజర్ అంటే అంతే చూపిస్తారని.. సినిమా మొత్తం చూపించరని ఒక ప్రభాస్ ఫ్యాన్ ఫైర్ అయ్యాడు.