విజయ్ ఆంటోనీ మంచితనానికి హ్యాట్సాఫ్.. ఆర్ నారాయణమూర్తి స్పీచ్
1148 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిప్రస్తుతం ‘బలగం’ గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకుంటున్నారో.. ‘బిచ్చగాడు’ విడుదలైన రోజుల్లో జనం అలాగే మాట్లాడుకున్నారని నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని సింప్లిసిటీ, గుడ్నెస్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. ‘డబ్బు వస్తుంది.. పోతుంది. కానీ, విలువలు శాశ్వతం. విలువలు ఉన్న సినిమాలు ఆయన మరిన్ని తీయాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు. మనోజ్ కుమార్, భారతీ రాజా, గురుదత్ లాంటి వాడు విజయ్ ఆంటోని అని ప్రశంసలు కురిపించారు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా నటించిన బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ కథానాయిక. ‘బిచ్చగాడు 2’ టీమ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు ఆర్ నారాయణమూర్తి అతిథిగా హాజరై మాట్లాడారు.