క్లీంకారాకు నెలరోజులు.. రామ్ చరణ్, ఉపాసన ఎమోషనల్ వీడియో
4891 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మెగా ప్రిన్సెస్ క్లీంకారా జన్మించి నేటికి సరిగ్గా నెల రోజులు. ఈరోజే ఆమె తల్లి ఉపాసన కొణిదెల పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒక అందమైన వీడియోను విడుదల చేశారు. క్లీంకార ఆగమనాన్ని ఈ వీడియోలో చూపించారు. ఉపాసన ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లిన దగ్గర నుంచి పాపకు క్లీంకార అని నామకరణం చేయడం వరకు ప్రతి క్షణాన్ని ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు, రామ్ చరణ్ - ఉపాసన తమ ఆనందాన్ని, అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. చెంచు జాతిలో తన కూతురును భాగం చేయాలని అనుకున్నానని.. అందుకే వాళ్లను బారసాలకు తీసుకొచ్చినట్టు ఉపాసన వివరించారు.