ఇంటికొచ్చిన రమ్యకృష్ణకు చీర పెట్టిన మంత్రి రోజా
3513 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఏపీ పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ నటి రోజా (Roja Selvamani) ఇంటికి ఆమె స్నేహితురాలు, సహచర నటి రమ్యకృష్ణ (Ramya Krishna) వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం కుమారుడు రిత్విక్‌ను తీసుకుని చిత్తూరు జిల్లా నగరిలోని రోజా ఇంటికి వెళ్లారు రమ్యకృష్ణ. ఆమెకు రోజా, సెల్వమణి దంపతులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అలాగే, నగరిలోని వైసీపీ నాయకులు, రోజా అనుచరులు సైతం రమ్యకృష్ణకు స్వాగతం పలికి ఆమెను శాలువాలతో సత్కరించారు. ఆమెతో ఫొటోలు దిగారు. అనంతరం కాసేపు రోజా కుటుంబంతో రమ్యకృష్ణ సరదాగా గడిపారు. రమ్యకృష్ణ బయలుదేరే ముందు ఆమెకు బొట్టుపెట్టి, చీర పెట్టి పంపారు రోజా.