‘సామజవరగమన’కు హిట్ టాక్ కేక్ కటింగ్‌తో సెలబ్రేషన్స్ షురూ
1046 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిశ్రీవిష్ణు, రెబా మౌనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. హాస్య మూవీస్ బ్యానర్‌పై అనీల్ సుంకర సమర్పణలో ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న రిలీజైన ఈ మూవీ సక్సెస్ సందర్భంగా టీమ్ కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ చిత్ర యూనిట్ ధన్యవాదాలను తెలియజేసింది. సీనియర్ నరేష్ కీలక పాత్రలో నటించారు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.