హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’తో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.