అమ్మాయిలూ ఆ టీకా వేసుకోండి.. పూనమ్ పాండే మృతితో టీవీ నటి సూచన
1521 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిPoonam Pandey: అమ్మాయిలందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని టీవీ నటి హెల్లీ షా సూచించింది. పూనమ్ పాండే మృతి చాలా బాధాకరమని పేర్కొంది. ‘సర్వైకల్ క్యాన్సర్ టీకా వేయించుకోవాలని నేను చాలా మంది అమ్మాయిలకు చెప్పాను. నేను కూడా వేయించుకున్నాను’ అని హెల్లీ షా తెలిపింది. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) ఫిబ్రవరి 2న ఉదయం కన్నుమూసింది. ఆమె మరణవార్త అభిమానులను షాక్కు గురిచేసింది. పూనమ్ పాండే కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు. 15 రోజుల కిందట ఉల్లాసంగా గడిపిన ఆమె.. ఇకలేదనే వార్త సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.