ఈ దేశం నీ బాబుదా.. పని చూసుకో.. అంకుల్‌పై ఉర్ఫీ జావేద్ ఫైర్
32157 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిచిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ఎలాంటి బిడయం లేకుండా బయట తిరిగే ఉర్ఫీ జావేద్‌ను ఎట్టకేలకు ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ‘ఇలాంటి బట్టలు వేసుకుని తిరగడానికి ఇండియాలో అనుమతి లేదు’ అంటూ బహిరంగంగానే ఉర్ఫీపై కామెంట్ చేశాడు. గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన ఉర్ఫీని ఎయిర్‌పోర్టులో చూసిన సదరు వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేశాడు. దీంతో ఉర్ఫీ జావేద్‌కు కోపం వచ్చింది. అయినా ఆ అంకుల్ తగ్గలేదు. ఇలాంటి దుస్తులు వేసుకుని భారతదేశం పరువు తీయొద్దు అంటూ హితవు పలికాడు. అయితే, ఉర్ఫీ మాత్రం ‘ఈ దేశం నీ బాబుదా.. పోయి పని చూసుకో అంకుల్’ అంటూ చుర్రుబుర్రులాడింది. అప్పటికే ఉర్ఫీని పాపరజ్జీ వీడియోలు తీస్తుండగా.. ఈ గలాటా కూడా రికార్డ్ అయిపోయింది.