ఇటలీలో వైభవంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం
14545 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిటాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వేద మంత్రాల సాక్షిగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇటలీలోని టుస్కానీలో ఉన్న బోర్గా సాన్ ఫెలిస్ రిసార్ట్లో వీరి పెళ్లి వేడుక జరిగింది.