తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వేణు
2041 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలుగు నటుడు, ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి శుక్రవారం తిరుమల కొండపై దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేణు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయం నుంచి బయటికి వస్తున్న వేణుతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. కాగా, ఒకప్పుడు కామెడీ, ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు.. చాలా కాలం వెండితెరకు దూరమయ్యారు. అయితే, చాలా ఏళ్ల తరవాత ఈ ఏడాది రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.