మెగాబ్రదర్ నాగబాబును చూడగానే.. విజయ్ దేవరకొండ సంస్కారం
2575 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్రలు పోషించిన ‘బేబీ’ సినిమా సంచలన విజయం సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర బృందం సోమవారం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే, మెగాబ్రదర్ నాగబాబు కూడా అతిథిగా పాల్గొన్నారు. వేదిక వద్దకు అప్పుడే వచ్చిన విజయ్ దేవరకొండ.. నాగబాబును చూసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకి చేతులు జోడించి నమస్కారం పెట్టారు.