ఇవన్నీ నా పర్సనల్ కోరికలు.. అందుకే మీకోసం ఇవి చేస్తున్నా: విజయ్ దేవరకొండ
ఇప్పటి వరకు గడిచిన జీవితంలో తాను తీర్చుకోలేకపోయిన తన వ్యక్తిగత కోరికలనే ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100 కుటుంబాలకు.. కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందజేశారు. ఈ మేరకు ఆ 100 కుటుంబాలకు చెక్లు అందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదిగి సంపాధించడం మొదలుపెట్టినప్పటి నుంచీ ప్రజలకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానన్నారు. ఇవన్నీ తన పర్సనల్ కోరికలని చెప్పారు. కాకపోతే కొంత మందికి చేయగలుగుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. మొత్తం 50వేల మంది లక్ష రూపాయల కోసం అప్లికేషన్ పెట్టుకోగా.. తన టీమ్ ఈ 100 మందిని ఎంపిక చేసిందన్నారు. అయితే, ప్రతి ఏటా ఏదో ఒక రకంగా మిగిలిన కుటుంబాలకు కూడా సాయం అందిస్తానని.. ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని విజయ్ దేవరకొండ హామీ ఇచ్చారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|15 Sept 2023