ఎవ్వరూ ఆస్పత్రికి రాకండి.. ఐసీయూలో నుంచే కొత్త ప్రభాకర్ రెడ్డి వీడియో
ఏపీ ఎన్నికలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
తెలంగాణ ఎన్నికల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించిన ఘటన దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి. అయితే.. ఈ ఘటనలో గాయపడిన ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో.. ఆయనను చూసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో.. అభిమానులెవ్వరూ ఆస్పత్రికి రావొద్దంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వీడియో సందేశాన్ని పంపించారు. కొద్ది రోజుల్లో తానే నియోజకవర్గానికి వస్తానని.. ఇక్కడికి వచ్చి ఎవరూ ఇబ్బంది పడొద్దని చెప్తూ.. వీడియో విడుదల చేశారు.