సూర్యుడిపై భారీ విస్ఫోటనం.. భూమికి సౌర తుఫాను ముప్పు
సూర్యుడి (Sun) ఉపరితలంపై అధిక సంఖ్యలో అయస్కాంత తంతువుల గురించి ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారు. ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలతో నిండి ఉండే ఈ తంతువులు.. యాదృచ్ఛికంగా సూర్యుని ఉపరితలంపై పెద్ద పేలుళ్లకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న తంతువుల్లో ఒకదానిలో భారీ పేలుడును నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. అంతేకాదు, దీని కారణంగా భూమివైపునకు భారీ కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) మేఘాలు కదలి వస్తున్నట్టు గమనించింది. తత్ఫలితంగా ఏర్పడే సౌర తుఫాను ప్రమాదకరమైనదిగా ఉంటుందని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి.generalTimesXP TeluguUpdated: 23 Apr 2023, 4:27 pm