ఆత్మహత్య ఎందుకు? దేశం కోసం త్యాగం చేయండి: గురుదేవ్ రవిశంకర్
5217 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిSri Sri Ravi Shankar: ఒక రైతు సంతోషంగా లేకపోతే, ఈ సమాజం ఎలా సంతోషంగా ఉంటుందని ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సృష్టికర్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు. రైతుల కష్టాలు తెలుసుకొని వారికి అండగా నిలవాలని, అదొక బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే, దేశం కోసం త్యాగం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన రైతులు మహారాష్ట్రలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా అద్భుతాలు చేస్తున్నారు. గురుదేవ్ స్ఫూర్తితో సేంద్రీయ సాగు చేస్తున్న సుమారు 10 వేల మంది రైతులు పుణే ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘గ్రామోత్సవ్ మహారాష్ట్ర’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీశ్రీ రవిశంకర్ కీలక సూచనలు చేశారు.