ఢిల్లీ సహా ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం
1148 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరాబోయే కొద్ది రోజులు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాది మీదుగా వీస్తున్న పశ్చిమ పవనాల ప్రభావంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలుచోట్ల రహదారులు జలమయమై... లోతట్టు ప్రాంతాలు మునిగాయియి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 126.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.