తరుచూ అర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అరుదైన అరోరా.. గత నెల లడఖ్‌లో కనువిందు చేసింది. భూ అయస్కాంత తుఫాను భూమిని తాకిన తర్వాత కనువిందు చేసిన ఈ సన్నివేశాన్ని.. హాన్లేలోని ఒక ఎత్తైన పరిశోధనా కేంద్రం ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IAO)లో ఏర్పాటు చేసిన 360-డిగ్రీల కెమెరా బంధించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని సాధారణంగా ఈ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి.