మెట్రో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఎత్తివేసిన హైదరాబాద్ మెట్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. మెట్రో మాల్స్, వారికి కేటాయించిన కొన్ని స్థలాల్లో ఇప్పటివరకు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తోన్న హైదరాబాద్ మెట్రో.. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే మాల్స్ వద్ద పార్కింగ్ రుసుముల బోర్డులు ఏర్పాటు చేశారు.