శ్రీవారికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు
1968 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా మానవ ప్రయత్నానికి తోడు భగవంతుడి ఆశీస్సులను కూడా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే, సూళ్లూరు పేట పట్టణంలోని చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆనవాయితీ దశాబ్దాల నుంచి వస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలకు చేరుకుని, బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని, ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు.