మహారాష్ట్రలో ‘కొడవలి గ్యాంగ్’లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పుణే, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా, ఓ కొడవలి గ్యాంగ్ పింప్రీ- చించ్వాడ్లో హల్చల్ చేసింది. స్థానిక అశోకా థియేటర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో ఓ మెడికల్ షాపులోకి దూరి.. అక్కడున్న సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. ఈ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.