ఊరి మంచి కోసం చేసే పనికి ఓ అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఆ ఊరి సర్పంచ్‌కు అది కోపం తెప్పించింది. నోట్ల కట్టలు మెడలో వేసుకొని వచ్చి కార్యాలయం ముందు గాల్లోకి ఎగరేశాడు. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అధికారి తిక్క కుదిరింది. మహారాష్ట్రలోని శంభాజీ నగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ మంగేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.