స్వర్ణ దేవాలయం సమీపంలో అర్ధరాత్రి వేళ భారీ పేలుళ్లు
1102 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిపంజాబ్లోని అమృత్సర్లో మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణదేవాలయం సమీపంలో భారీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించి.. చుట్టుపక్కల గాలిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రెండుసార్లు పేలుడు సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్లలో వీరి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.