రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. దేవతలా అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్
పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని చివరి క్షణాల్లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడింది. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. ఈ వీడియోను ఆర్పీఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.