LIVE: సార్వత్రిక ఎన్నికలు 2024 నోటిఫికేషన్ ప్రెస్ మీట్
1408 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిదేశంలో ఎన్నికల సందడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం (మార్చి 16) మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనుండటం విశేషం. దీంతోపాటు దేశంలో ఖాళీ అయిన వివిధ అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదల కానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించనున్నారు.