బోరుబావిలో ఆడశిశువు.. 5 గంటలు శ్రమించి కాపాడారు
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
Girl Child in Borewell: అప్పుడే పుట్టిన ఆడశిశువును బోరుబావిలో పడవేశారు. స్థానికులు పసికందు రోదనలు విని పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. ప్రొక్లెయినర్‌తో ఆ బోరుబావికి సమాంతరంగా భారీ గొయ్యి తవ్వించారు. 40 మందితో కూడిన సహాయక బృందం సుమారు 5 గంటలు శ్రమించి శిశువును బయటకి తీసుకొచ్చింది. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా రెంగాలి ప్రాంతం లారీపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పసికందుకు ప్రాథమిక చికత్స అందించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ప్రస్తుతం సురక్షితంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.