ఈ ప్రేమ విడదీయలేనిది.. ఆ యువకుడిని చూడగానే కొంగ రియాక్షన్ చూశారా
తనను కాపాడిన యువకుడు కనిపించగానే అతడి దరికి చేరేందుకు కొంగ పడిన తాపత్రయం అటవీ అధికారులతో పాటు అందరినీ కదిలిస్తోంది. అమేథీ (ఉత్తర్ ప్రదేశ్)కి చెందిన మహ్మద్ ఆరిఫ్, కొంగ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఆరిఫ్ వెంటే తిరుగుతున్న ఆ కొంగను.. కొద్ది రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు అతడికి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిపోయారు. దాన్ని కాన్పూర్లోని జూలో ఉంచారు. అధికారుల అనుమతితో సుమారు 2 వారాల తర్వాత ఆరిఫ్ తన నేస్తాన్ని చూసేందుకు కాన్పూర్ జూకు వచ్చాడు. అతడిని చూడగానే ఆ సారస్ కొంగ తన రెక్కలు ఆడిస్తూ ఎగిరి గంతేసింది. ఎన్క్లోజర్ను చేధించుకొని అతడి దగ్గరికి చేరేందుకు ఆసక్తి కనబరిచింది.generalTimesXP TeluguUpdated: 13 Apr 2023, 4:24 pm