ఎంత పెద్ద చొక్కాలూ.. టీమిండియా కొత్త జెర్సీల ప్రదర్శన సూపర్
1293 views
జనరల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిటీమిండియా కొత్త జెర్సీలివి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డ్రోన్ల సాయంతో ప్రదర్శించారు. మూడు ఫార్మాట్లలో ధరించే జెర్సీలను ఎగురవేశారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా బైజూస్ కంపెనీ టీమిండియా జెర్సీ (jersey) స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇక నుంచి గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్ (Adidas) ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. మొత్తం ఐదేళ్ల కాలానికి జెర్సీ స్ఫాన్సర్‌గా అడిడాస్ వ్యవహరించబోతోంది. బీసీసీఐతో రూ. 350 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ జట్టు ఈ కొత్త జెర్సీని వేసుకుని ఆస్ట్రేలియా జట్టుతో జూన్ 7 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనుంది.