పక్షవాతం రావడానికి కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
1034 views
ఆరోగ్యం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిపక్షవాతం రావడానికి కారణాలు లక్షణాలు, నిర్ధారణ, చికిత్స గురించి డాక్టర్ రోహిత్ కుమార్ బండారి మాటల్లో తెలుసుకుందాం.. కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు ప్రాధమిక దశలోనే కొన్ని రకాల లక్షణాలను చూపిస్తాయి. ఆ లక్షణాలను తేలికగా తీసుకోవడం, పట్టించుకోకపోవడం వల్ల వ్యాధి లేదా ఆరోగ్య పరిస్థితి ముదిరిపోయాక కానీ వైద్యులను సంప్రదించరు. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కణాల్లోకి రక్త సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రాగానే వెంటనే వైద్య సహాయం అందకపోతే చాలా ప్రమాదం.