గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స
ఆరోగ్యం వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స గురించి డాక్డర్ స్వప్న మాటల్లో తెలుసుకుందాం..గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.. మనదేశంలో మధ్యవయసు స్త్రీలలో చాలా ఎక్కువగా కనబడుతున్న క్యాన్సర్ ఇది. పైకి ఎటువంటి లక్షణాలూ లేకుండానే.. నిశ్శబ్దంగా ప్రాణాలను హరించే క్యాన్సర్లలో ఇదే ప్రధానమైంది. మొదటి దశలో దీన్ని గుర్తించకపోవడం, అవగాహనా లోపం.. వంటి కారణాల వల్ల దీని బారిన పడి ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహిళల్లో క్యాన్సర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సర్. కానీ దీంతో పాటు సర్వైకల్ క్యాన్సర్/గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..