జీవో 111 ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కాం: బండి సంజయ్
111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదిలాబాద్లో ఆరోపించారు. పేదల వద్ద కారుచౌకగా ఎకరాల చొప్పున కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు కొట్టేశారని తెలిపారు. 111 జీవో ఎత్తేసిన తరువాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందా చేస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
politicalTimesXP TeluguUpdated: 21 May 2023, 6:00 pm