దమ్ముంటే అదానీ గురించి మాట్లాడండి.. అమిత్ షాకు కేటీఆర్ సవాల్
1177 views
పొలిటికల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో (KTR Comments on Amit Shah) గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయని బీజేపీ ఈరోజు అడ్డగోలు ప్రచారం చేసుకుంటుందన్నారు. బీజేపీ మాటలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణకు చట్టప్రకారం దక్కాల్సిన ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వారి ద్వంద్వనీతికి అద్దం పడుతుందన్నారు. అమిత్ షా కానీ, ప్రధానీ కానీ సత్తా ఉంటే తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని సవాలు విసిరారు. మతం, ఓవైసీ పేరు మీదు చేసిన పిచ్చి రాజకీయాల కంటే తాము చేసింది ఏంటో చెప్పాలన్నారు. అదానీ గురించి మాట్లాడమంటే మాత్రం అమిత్ షాకు, మోదీకి నోరు పెగలదు అని విమర్శించారు.