Thangalaan Teaser: విక్రమ్ విశ్వరూపం.. అదిరిపోయిన నేపథ్య సంగీతం
2611 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండివిలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘తంగలాన్’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగిన కథగా పా రంజిత్ చూపించబోతున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నారు. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు టీజర్ విడుదల చేశారు. డైలాగులు ఏమీ లేకుండా కేవలం విజువల్స్‌తో టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్లో విక్రమ్ విశ్వరూపం చూడొచ్చు. బంగారు నేలలో జరిగిన రక్తపాతాన్ని సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో నివసించిన ఒక తెగ పోరాటమే ఈ సినిమా. ఆ తెగకు నాయకుడు విక్రమ్. ఆయన క్రూరత్వం ఎలా ఉంటుందో టీజర్లో కొన్ని సీన్లు చూస్తుంటే అర్థమవుతుందో. అంతేకాకుండా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఒంట్లో వణుకు పుట్టించేలా ఉంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు.