‘జైలర్’ షో కేస్: దుమ్ములేపిన రజనీకాంత్
1402 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్ వెర్షన్ నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది. ఈ మధ్యే ఈ పాటకు తెలుగు, హిందీ వెర్షన్లను విడుదల చేశారు. కాగా, ఈరోజు ‘జైలర్’ షో కేస్ (ట్రైలర్)ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు నెల్సన్. ట్రైలర్ చూస్తుంటే ఇది ‘బాషా 2’ అవుతుందేమో అనిపిస్తోంది.