‘మంగళవారం’ ట్రైలర్: అజయ్ భూపతి గట్టిగానే ప్లాన్ చేశాడు!
1220 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఒక ప్రధాన పాత్రలో నటించారు. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. అజయ్ భూపతి స్టైల్లోనే రస్టిక్‌గా ఉంది. దీనికి తోడు అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ఇక ఈ సినిమాలో శృంగార సన్నివేశాలకు కూడా అజయ్ భూపతి పెద్దపీట వేశారు. నిజానికి వాటి చుట్టూనే సినిమా కథ నడుస్తున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. హత్యల వెనుక కారణం కూడా ఇదే అనిపిస్తోంది.