‘మంగళవారం’ టీజర్ వచ్చేసింది.. భయం భయంగా
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘మంగళవారం’. ‘RX 100’ వంటి కల్ట్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను గమనిస్తే.. హారర్ మూవీ అని తెలుస్తుంది. ఏదో ఉందనే భయాన్ని క్రియేట్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.