Bholaa Shankar Trailer: అండర్ కవర్ కాప్‌గా మెగాస్టార్.. ఎంటర్టైన్మెంట్ షురూ!
2403 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘భోళా శంకర్’ ట్రైలర్ వచ్చేసింది. వెండితెరపై రెండున్నర గంటలపాటు మెగా ఎంటర్టైన్మెంట్ను ‘భోళా శంకర్’ సినిమా అందించబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. 2.20 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ అభిమానులకు కావాల్సిన అన్ని హంగులను చూపించేసింది. ముఖ్యంగా మెగాస్టార్ మేనియా స్పష్టంగా కనిపించింది. మెహర్ రమేష్ తన రీమేక్ టెక్నిక్‌ను ఈ సినిమా విషయంలోనూ అద్భుతంగా వాడారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్గా నటించిన తమన్నా.. లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ లాంటి సీనియర్ నటులు తమ హాస్యంతో కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.