‘నా సామిరంగ’ టీజర్: నాగార్జున ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్
3125 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిరొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’తో కింగ్ నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాతో విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ అదిరిపోయింది. నాగార్జున అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో మరోసారి కింగ్ మెప్పించబోతున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.