‘హాయ్ నాన్న’ ట్రైలర్: మరో ఎమోషనల్ లవ్ స్టోరీతో నాని
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బేబి కియారా ఖన్నా ఈ సినిమాలో నాని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ద్వారా ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు ఎవరనేది తెలిసింది. శృతిహాసన్ కూడా ఈ సినిమాలో నటించారు. నాని భార్య పాత్రలో ఆమె కనిపించనున్నారు.