Yatra 2: నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని... ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్
1090 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండివై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. ఈ ప్రయాణాన్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహి వి.రాఘవ్. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై శివా మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఆకాశం వైపు చూపుతూ అభివందనం చేసేలా ఉన్న చేయిపై ఓ వ్యక్తి నడుచుకుంటూ పైకొస్తాడు. లక్షలాదిగా నిలుచున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఎవరో ప్రపంచానికి తెలియక పోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేనున్నాను.. నేను విన్నాను అనే డైలాగ్ మోషన్ పోస్టర్లో ఉంది. చాలా ఇంట్రస్టింగ్‌గా మోషన్ పోస్టర్ ఉంది. సంతోష్ నారాయణ్ అందించిన బీజీఎం నెక్ట్స్ రేంజ్లో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది.