‘చెలి మోహమే’ సాంగ్.. మరోసారి మ్యాజిక్ చేసిన విశాల్-ఎస్పి చరణ్
1932 views
తెలుగు వీడియో పాటలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శాంతల’. ఈ చిత్రం ద్వారా నిహాల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్రివిక్రమ్ శేషు ఈ పీరియడ్ మూవీకి దర్శకత్వం వహించారు. కె.ఎస్.రామారావు సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ ఇర్రంకి సురేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని రెండో పాట ‘చెలి మోహమే’ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు. పాటను వీక్షించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాటను విశాల్ చంద్రశేఖర్ స్వరపరచగా ఎస్పి చరణ్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. విశాల్ చంద్రశేఖర్-ఎస్పి చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘సీతారామం’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ పాట కూడా ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది.