Jawan: దుమ్మే దులిపేలా వీడియో సాంగ్.. షారుఖ్ అదరగొట్టాడు!
1623 views
తెలుగు వీడియో పాటలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనె ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మూడు వారాల క్రితం విడుదలైన ‘జవాన్’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘జిందా బందా హై’ అంటూ హిందీలో కంపోజ్ చేసిన ఈ పాటను తెలుగులో ‘దుమ్మే దులిపేలా’ అంటూ అందించారు. అనిరుధ్ స్వరపరిచి ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ తెలుగు లిరిక్స్ రాశారు. కోలీవుడ్ కొరియోగ్రాఫర్ శోభి పాల్‌రాజ్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.