‘డయ్యో డుగు డుగు డుగు’ సాంగ్.. మంగ్లి మళ్లా మడతెట్టేసింది!
3533 views
తెలుగు వీడియో పాటలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు సూర్యతేజ ఏలే హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ఈ సినిమాకు సూర్యతేజ కథ, మాటలు కూడా అందించారు. ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ (సలీమ్ ఫేకు), టెంపర్ వంశీ, గంగవ్వ తదితరులు నటించారు. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమాను పాయల్ సరఫ్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘డయ్యో డుగు డుగు డుగు’ అంటూ సాగే పాటను ఈరోజు విడుదల చేశారు. ఈ పాటను మంగ్లి ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.