నాలుగేళ్ల చిన్నారిని మింగేసిన మ్యాన్‌హోల్
4526 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా.. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఫలితంగా నాలాలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక నాలుగేళ్ల బాలున్ని నాలా మింగేసింది. అప్పటి వరకు ఇంట్లోనే ఆడుకున్న చిన్నారి మిథున్ రెడ్డి.. వర్షం తగ్గటంతో బయటకు వెళ్లగా మ్యాన్ హోల్ గమనించకపోవటంతో.. అందులో పడిపోయాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నాలాలో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతదేహం సాయి నగర్ చెరువులో కనిపించటంతో.. ఆరు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. విగత జీవిగా మారిపోవటంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.