సిగ్నల్ పడటంతో ఆటో ఆపిన డ్రైవర్.. చెట్టు కూలి మృతి
2969 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిHyderabad: ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి ఊహించని రీతిలో దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ ఘటన (Auto Driver Death) జరిగింది. సోమాజిగూడ ఎమ్ఎస్ మక్త ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ గౌస్ పాషా తన ఆటో తీసుకొని వెళ్తుండగా.. హైదర్‌గూడ్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో ఆటోను ఆపేశాడు. అదే సమయంలో రోడ్డుపక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కుప్పకూలి ఆటో మీద పడిపోయింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.