Hyd: ఫోటోల కోసం మహల్ వద్దకు వెళ్తే.. పా.. పా.. భారీ పాము
2315 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసరదాగా ఫోటోలు తీసుకుందామని కొంత మంది యువకులు హైదరాబాద్ శివార్లలోని ఓ పురాతన మహల్ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఓ సొరంగం కనిపించింది. అందులోకి అడుగుపెట్టారు. అంతే.. భయంతో వణికిపోయారు. 10 అడుగుల నాగుపాము వారి పైకి బుసలు కొట్టింది. అది చూసి పరుగు అందుకున్నారు. అత్తాపూర్లోని పురాతన కట్టడం ముష్క్ మహల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. యువకులు బయటకి వచ్చాక ఆ భారీ సర్పం కూడా అక్కడ నుంచి వెళ్లిపోయింది. పురాతన సొరంగం బయటపడటం, అందులో నుంచి భారీ సర్పం బయటికి రావడంతో అక్కడ గుప్త నిధులేవైనా ఉన్నాయేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.