షాద్‌నగర్ అగ్నిప్రమాదం: 50 మందిని కాపాడిన బాలుడు.. తాడు కట్టి సాహసం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 మంది ఉండగా.. అందులో చాలా వరకు కార్మికులు బయటకు రాగా.. సుమారు 50 మంది మంటల్లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్లను కాపాడేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించగా.. ఓ బాలుడు చేసిన సాహసం 50 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసింది.