పార్కింగ్ స్థలంలో నిద్రలో పాప.. చిదిమేసిన కారు, ఎంత ఘోరం
4317 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఅపార్ట్మెంట్లో నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన ఓ మహిళ.. తన మూడేళ్ల చిన్నారిని ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంటు సెల్లార్లో నీడలో పడుకోబెట్టింది. తన పనిలో నిమగ్నమైంది. ఇంతలో పాప నుంచి పెద్దగా ఆర్తనాదాలు వినిపించడంతో అందరూ అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఆ అపార్టుమెంటులోకి అప్పుడే కారులో వచ్చిన ఓ వ్యక్తి.. పార్కింగ్ స్థలంలో పడుకొని ఉన్న పాపను గమనించకుండా ముందుకు పోనియ్యడంతో.. నిద్రిస్తున్న పాప పైకి ముందు టైరు ఎక్కింది. తల ఛిద్రమై ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన హయత్‌నగర్‌లోని లెక్చలర్స్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో జరిగింది.