ఖైరతాబాద్ గణేష్ సేవలో కార్పోరేటర్ విజయారెడ్డి
Hyderabad: కార్పొరేటర్ విజయారెడ్డి ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) సేవలో పాల్గొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 18) వినాయక చవితి సందర్భంగా ఆమె మహా గణేశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరిక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీ దశ మహా విద్యాగణపతిగా రూపానా మహా గణపతి ఇక్కడ ప్రజలకు దర్శనం ఇస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ విశిష్ట పూజలు నిర్వహిస్తుంటారని, ఇక్కడ తొలిపూజ గవర్నర్ చేతులు మీదుగా జరగడం ఆనవాయితి అని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా ఇక్కడకు స్వామివారిని దర్శించుకుంటారని, ఖైరతాబాద్ గణపతిని ఒక్కసారి దర్శించుకుంటే ఏడాదిపాటు విజ్ఞాలు తొలుగుతాయని భక్తులు నమ్మకమని విజయారెడ్డి పేర్కొన్నారు.
Authored byCurated byరవి కుమార్|TimesXP Telugu|18 Sept 2023